( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన అయ్యప్ప మాలలు ధరించి మహా పాదయాత్రకు వరసగా రెండవసారి మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ స్వాముల తో కలిసి బయల్దేరిన రాయికల్ గ్రామ అయ్యప్ప భక్తులు. ఈరోజు నందిగామ మండలంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరుముడి కట్టుకొని పాదయాత్రకు బయలుదేరిన స్వాములకు ఘన స్వాగతం పలికిన షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఈరోజు నుండి దాదాపు 35 రోజులు మహా పాదయాత్రను చేపట్టినటువంటి అయ్యప్ప స్వాములు క్షేమంగా వెళ్లి, ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించుకొని తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క అయ్యప్ప స్వామి కృపా కటాక్షం ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలి ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాయక్, మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, రాయికల్ శ్రీనివాస్, రాజు నాయక్, మైనారిటీ నాయకులు ఎస్ డి ఇబ్రహీం, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు…

