
పయనించే సూర్యుడు. మార్చి 4. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్. పదేళ్లుగా మూఢనమ్మకాలు పెరిగాయి
- వీటికి వ్యతిరేకంగా కార్యకర్తలు పని చేయాలి జెవివి ఆవిర్భావ దినోత్సవ సదస్సులో కెఎల్ కాంతారావు ఖమ్మం : సమాజంలో శాస్త్రీయ ఆలోచనలు పెరిగేందుకు జెవివి కార్యకర్తలు కృ షి చేయాలని జనవిజ్ఞాన వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షులు కెఎల్ కాంతారావు పేర్కొన్నారు. ప్రపంచీకరణ దుష్ఫలితాల వల్ల మనిషిలో అభద్రతా భావం పెరిగిందని, దీంతో మూఢనమ్మకాల వైపు పయనిస్తున్నాడని అన్నారు. అందుకే మూఢనమ్మకాల నిర్మూలనకు పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జనవిజ్ఞాన వేదిక అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని జెడ్పీ మీటింగ్ హాల్‌లో సదస్సు జరిగింది. జిల్లా అధ్యక్షులు వి.మోహన్ అధ్య క్షతన జరిగిన సదస్సులో కెఎల్ కాంతారావు మాట్లాడుతూ పదేళ్లుగా మతోన్మాద శక్తులు మూఢనమ్మకాలను పెంచుతున్నాయన్నారు. సాక్షాత్తూ పాలకులే వీటిని పెంచే పనిలో ఉండడం విచారకరమన్నారు. చెప్పింది రుజువు చేసేది సైన్స్ మా త్రమేనన్నారు. మనిషి మనుగడకు, అభివృద్ధికి సైన్స్ దోహదం చేస్తుందన్నారు. ప్రశ్నించే తత్వాన్ని సైన్స్ నేర్పు తుందన్నారు. అందుకే అందరూ శాస్త్రీయ దృక్ప థాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు జెవివి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో జెవివి పాత్ర పెరిగిందని, కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జెవివి రాష్ట్ర ఉ పాధ్యక్షులు అలవాల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో జనవిజ్ఞానవేదిక చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 1990లో అకడమిక్ కమిటీ ఏర్పడిన తర్వాత నిర్వహించిన స్తంభాద్రి బాలమేళా కార్యక్రమం అందరినీ ఆలోచిం పచేసిందన్నారు. 1994లో ఢిల్లీలో జరిగిన నేషనల్ బాల మేళాలో జిల్లా నుండి ముగ్గురు పాల్గొన్నారని, ఇదొక చారిత్రక కార్యక్రమమని అన్నారు. మన బడి కార్యక్రమం ద్వారా బడికి వెళ్లని వారు, బడిని మానేసిన వారికి రాత్రి పూట
బడులు నిర్వహించి 400 మంది విద్యార్థులను ఏడో తరగతి కామన్ పరీక్షలు రాసేలా చేశామన్నారు. సంచారక్ ప్రయోగశాల కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో
నాలుగన్నరేళ్లుగా నిర్వహించామన్నారు. జూలూరుపాడు మండలంలో సంచార గ్రంథాలయాన్ని రెండేళ్ల పాటు నిర్వహించామన్నారు. ఇంకా అక్షరాస్యతా ఉద్యమం , సారా వ్యతిరేక ఉద్యమంలో జెవివి చురుకుగా పాల్గొందన్నారు. జెవివి కార్యక్రమాలు తెలుసుకున్న నాటి గవర్నర్ కృష్ణకాంత్ ఖమ్మం వచ్చినప్పుడు
నాయకులను పిలిపించుకుని మాట్లాడారని, ఇదెంతో గౌరవాన్ని తెచ్చిందని అన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శి
క్షణ ఇచ్చామన్నారు. దాశరథి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించామని, ఈ సందర్భంగా కవి సమ్మేళనం ఏర్పాటుచేసి వచ్చిన కవితలతో సంకలనం
తీసశామన్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దా అనే నినాదం తో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జీవపరిణామ సిద్ధాం
తంపై సెమినార్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల కోసం చెకుముకి పత్రికను నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా బాలల్లో దాగి ఉన్న సృజనాత్మకతను
వెలికితీసేందుకు చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జెవివి పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు కట్టా సత్యప్రసాద్ మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం
పెరిగేందుకు విస్త్రతంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తొలుత జెవివి మొదటి కన్వీనర్ వాసిరెడ్డి మల్లిఖార్జున్‌రావు జెండావిష్కరణ గావించారు. అనం
తరం ప్రారంభమైన సభ వంజాకు లక్ష్మీనారాయణ సంతాప తీర్మానాన్ని వేశపెట్టారు. సభలో జెవివి నాయకులు ప్రతాప్, పొత్తూరి సీతారామారావు,
దేవేంద్ర, మధు తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇంకా ఈ సభలో జిల్లా గౌరవాధ్యక్షులు మల్లెంపాటి వీరభద్రరావు, మచ్చా సూర్యనారాయణ వంజాకు లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టి.శివన్నారాయణ, సమత కన్వీనర్ కె.రాములమ్మ, జెవివి ప్రారంభ సభ్యులు ఝాన్సీ కుమారి,
జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.