
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పయనించే సూర్యుడుఆగష్టు 23 (పొనకంటి ఉపేందర్ రావ్ )
టేకులపల్లి మండల మహాసభను శనివారం జూనియర్ కాలేజిలో నిర్వహించడం జరిగినది. టేకులపల్లి మండల నాయకులు.ఎ లోకేష్.అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి జె. గణేష్ పాల్గొని మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పై మూకుముడిగా దాడి చేస్తున్నాయని, సామాజిక అంశమైన విద్యను వ్యాపార సరుకుగా మారుస్తున్నాయని, ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం. ప్రైవేటు యూనివర్సిటీలను రాష్ట్రంలో ప్రవేశ పెడుతూ, కార్పొరేట్ విద్యా వ్యవస్థకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు కారుస్తున్నారని, ప్రభుత్వ విద్యా వ్యవస్థ దెబ్బ తినడం మూలాన పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందని కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు ర్యాంకుల వెంట విద్యార్థులను పరుగులు పెట్టించి మానసిక వత్తిడికి గురి చేస్తు వారిని బలి తీసుకుంటున్నాయని, ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఎన్నిసార్లు సమస్యలు విన్నవించిన ప్రభుత్వం స్పందించే విధానం లేదని, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో ఒకే మతానికి కొమ్ముకాసే విధంగా విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నాయని, ఇలాంటి తరుణంలో విద్యారంగంలోని సమస్యలపై పాలక ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో . లోకేష్, బి. ప్రశాంత్, రాజేశ్వరి, ఉష ,దీపిక ,సాయి కిరణ్ ,ఎం. ఉపేందర్, తిలక్, ఆనంద్ పాల్గొన్నారు.