
కలుషితమవుతున్న త్రాగునీరు…
పట్టించుకోని అధికారులు…
రుద్రూర్ లో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకు…
రుద్రూర్, సెప్టెంబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని 9 వ వార్డులో గల శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి, పెచ్చులు ఊడిపోయి, ఇనుప చువ్వలు బయటకు దర్శనమిస్తున్నాయి. ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని కాలనీవాసులు తీవ్ర భయందోలనకు గురవుతున్నారు. ఈ శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ గురించి అధికారులు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఈ వాటర్ ట్యాంక్ కు గత ఇదేళ్ల నుండి మెట్లు కూడా లేవని, అధికారుల పర్యవేక్షణ లోపంతో కలుషితమైన త్రాగునీరు వస్తుందని, ఈ నీరు త్రాగడం వలన రోగాల భారిన పడుతున్నామని కాలనీవాసులు తీవ్రంగా మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్ పై దృష్టి సారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.