
పయనించే సూర్యుడు న్యూస్ జులై 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
“పవిత్రమైన గీతవృత్తికి కళంకం తెచ్చే నకిలీ వ్యాపారుల పనిపట్టాలి” గీత కార్మికుల ముసుగులో నకిలీలు కళ్ళు దందాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారు పేద మధ్యతరగతి ప్రజల కు కల్తీ కల్లు విక్రయిస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారు . ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేటు , డైజోఫాం ,సిట్రస్ యాసిడ్ లాంటి రసాయనాలను నగర శివారు పారిశ్రామిక వాడలలోని కొన్ని పరిశ్రమల నుంచి చాటుగా కొనుగోలు చేసి కల్తీ కల్లు తయారీకి ఉపయోగిస్తున్నారు . ఈ దందాలు తెలిసి కూడా సంబంధిత అధికారులు లంచాలకు మరిగి ఈ కల్తీ వ్యాపారాన్ని నిర్మూలించకపోవడంతో ఎన్నో కుటుంబాలు అనారోగ్యాలు బారిన పడి ఆర్థికంగా చితికి పోతున్నాయి . ఇప్పటికైనా నకిలీ గీత కార్మికుల ఆగడాలను అరికట్టకపోతే మునుముందు మరెన్నో ఘోరాలను చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా ము. ముఖ్యంగా ఎక్షైజ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నకిలీ గీత కార్మికుల కు తాటి చెట్టు ఎక్కి కల్లు తీసే పరీక్షలు పెట్టి అనర్హుల కల్లు దుకాణం లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము . అర్హులైన గీత కార్మికులను గుర్తించి వారికి దుకాణం లైసెన్సులు మంజూరు చేయాలని కోరుతున్నాము . మాయదారి కల్లు మాఫియా నిర్వహిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం . పవిత్రమైన గీత వృత్తికి కళంకం తీసుకొస్తున్న వారి ఆటలు సాగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం . హైదరాబాద్ అడ్డగా కల్లు మాఫియా నిర్వహిస్తూ ప్రమాదకరమైన రసాయనాలను మన తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ , రాజస్థాన్ మరికొన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను.