పయనించే సూర్యుడు జనవరి 12. పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షునిగా పైల చిట్టిబాబును నియమించడం పట్ల నాయకులు కార్యకర్తలు, సర్వత్ర ఆనందాన్ని వ్యక్తపరిచారు. పలాస మండలం బ్రాహ్మణతర్లకు చెందిన పైల చిట్టిబాబును ఈ పదవిలో నియమించినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం వెలువడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు, శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన ప్రసాద్ కు తన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పటిష్టవంతంగా చేయటానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలను చేస్తానని ఆయన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పైల చిట్టిబాబు
RELATED ARTICLES