
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్
మే 28 చింతూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోయుగపురుషుడు తెలుగువాడి ఖ్యాతి ప్రపంచ స్థాయికి తెలియజేసిన వ్యక్తి అనేక సంక్షేమ పథకాలు సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నందమూరి తారక రామారావు గారి 102 వ జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇళ్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ ఏజెన్సీలో ఉద్యోగాలు ఆదివాసులకే ఉండాలని సంస్కరణ తీసుకువచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారిని అలాగే పివిటిసిలకు అంథోదయ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం, పేద పిల్లల చదువుకోవడానికి రెసిడెన్సి స్కూల్ అలానే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు ఓబుల్నేని రామారావు చౌదరి మరో మాజీ అధ్యక్షులు జాంగిర్ సీనియర్ నాయకులు పొదిలి రామారావు కట్టాశంకర్ ముత్యాల శ్రీరామ్ యూత్ అధ్యక్షులు గడ్డం సురేష్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు క్లస్టర్ ఇంచార్జ్ ఓబులేని నరసింహారావు ఆసిఫ్ తుర్ర ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.