
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లో మసీదు వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో శ్రీరామనవమి అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి భోజనాలు చేయడం జరిగింది సోమవారం ఉదయం నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ అర్చనలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో అలంకరించారు. ఉదయం నుండి భక్తులకు అన్నదాన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
