Monday, April 7, 2025
Homeఆంధ్రప్రదేశ్శ్రీరాముడి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి జిల్లాకలెక్టర్ ఎస్పీ అధికారులతో రాష్ట్ర...

శ్రీరాముడి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి జిల్లాకలెక్టర్ ఎస్పీ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

Listen to this article
  • పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావ్

  • అయోధ్యలో వెలసిన రాముడు కంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాముడు నడయాడిన ప్రాంతం భారతదేశానికి తలమానికమని అటువంటి రాముడి కళ్యాణానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నాడు భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముల వారి కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేయడానికి వస్తున్నందున జిల్లా యంత్రాంగం సమన్వయంతో వారికి అప్పగించిన బాధ్యతలే కాకుండా తోటి అధికారుల బాధ్యతలు కూడా తీసుకొని వివిఐపీలకు, వీఐపీలకు,రామ భక్తులకు గాని, ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మర్యాదపూర్వకంగా ప్రవర్తించి అందరూ తనివి తీర కళ్యాణం తిలకించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. స్వామి వారి కళ్యాణం వైభవపేతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈనెల 06 వ తేదీన స్వామివారి కళ్యాణం ఉదయం 10:30 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుందని అలాగే ఏడవ తేదీన జరిగే మహా పట్టాభిషేకం ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతుందని అన్నారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి కళ్యాణం టికెట్లు దేవస్థానం సి ఆర్ ఓ కార్యాలయం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంచామని, అలాగే ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవడానికి ప్రత్యేకమైన యాప్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు, అత్యవసర చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 50 బెడ్లు, ప్రత్యేక వార్డు మరియు పర్ణశాలతో కలుపుకొని 13 మెడికల్ క్యాంపులు, మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది సరిపడా మందులు అందుబాటులో ఉంచుకున్నామని అన్నారు. కళ్యాణం తిలకించడానికి మండపాన్ని 26 సెక్టార్లుగా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, భక్తులకు మంచినీరు, మజ్జిగ పాకెట్లు, విఐపి సెక్టర్ మొదలుకొని భక్తులకు మంచినీళ్లు టాప్స్ ఏర్పాటు చేశామని మరియు పార్కింగ్ ప్రదేశాలతో పాటు ఏడు చోట్ల మరియు భద్రాచలం పట్టణంలో డ్రమ్ములు ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని, అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కరకట్ట ప్రదేశం నుండి కళ్యాణం జరుగు స్టేడియం, భద్రాచలం పట్టణం, దేవాలయం పరిసరాలలో ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా 35 చోట్ల 350 మంది గ్రామపంచాయతీ లేబర్ ను అందుబాటులో ఉంచామని అన్నారు. స్వామివారి తలంబ్రాలు పంపిణీకి 80 కౌంటర్లు, లడ్డూలు సరఫరాకు 19 కౌంటర్లు, ప్రతిరోజు లక్షన్నర లడ్లు, భక్తులకు అందించేలా చర్యలు తీసుకున్నామని, ఈ సంవత్సరం భక్తులకు తలంబ్రాలు కొరత కాకుండా 200 క్వింటాళ్లు తయారుచేసి సిద్ధంగా ఉంచామని అన్నారు. కళ్యాణానికి తెలంగాణ సీఎం వస్తున్నందున బిపిఎల్ లో మూడు చోట్ల హెలిపాడ్లతోపాటు అదనంగా టొబాకో బోర్డులో కూడా హెలిప్యాడ్ సిద్ధంగా ఉంచుకోవాలని, భారీ కేడింగ్ తో పాటు సారపాక నుండి కళ్యాణ మండపం వరకు రోడ్డుకి ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించుకోవాలని, గ్రామపంచాయతీ వారి సహకారంతో రోడ్డు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశించారు. కళ్యాణము మరియు పట్టాభిషేకం అయిపోయే వరకు విద్యుత్ సమస్య రాకుండా చూసుకోవాలని, అవసరమైతే 500 కెపాసిటీ గల కెవి టు జనరేటర్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. భక్తులు గోదావరి లోకి వెళ్లకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని, రిస్క్ బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని, స్త్రీలు బట్టలు మార్చుకునే షెల్టర్లు ఏర్పాటు చేయాలని, పర్ణశాలలో కూడా భద్రాచలంలో చేసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ శాఖ వారికి ఆదేశించారు. టిఎస్ఆర్టిసి ద్వారా భక్తులకు ఉదయం నుంచే కళ్యాణమండపం వచ్చే విధంగా బస్సులు నడిపించాలని అన్నారు. కళ్యాణము పట్టాభిషేకం అయిపోయే వరకు భద్రాచలంతో పాటు సారపాక ఏటపాకలలో ఉన్న బార్ షాపులు అన్ని మూయించాలని, భద్రాచలం కు వచ్చే ప్రతి వాహనమును క్షుణ్ణంగా పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ వారికి ఆదేశించారు. భద్రాచలంకు వచ్చే భక్తులు హోటల్లో కానీ రోడ్ల పైన గాని దొరికే తినుబండారాలు నాసిరకంగా ఉండకుండా చూడవలసిన బాధ్యత ఫుడ్ ఇన్ స్పెక్టర్ పై ఉన్నందున ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలని అన్నారు. అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ ఇంజన్లు కళ్యాణ మండపం మొదలుకొని ముఖ్యమైన కూడళ్లలో అందుబాటులో ఉంచి పట్టణం మొత్తం పహారా కాస్తూ ఉండాలని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన సమాచారం తెలిసే విధంగా సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అధికారులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు మన బంధువుల మాదిరిగా భావించి వారికి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదాం వీరయ్య, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి, రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీవో దామోదర్ రావు, ఈవో రమాదేవి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments