
పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 18// //రిపోర్టర్ సి తిమ్మప్ప మక్తల్// నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మద్వార్ గ్రామంలో నేడు 24 మంది శివ స్వాములు ఇరుముడులు కట్టుకొని పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు. ముందుగా గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం దగ్గర నుంచి గ్రామంలో ఊరేగింపుగా గుట్ట దగ్గర ఉన్న శివాలయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పది రోజులు పాటు పాదయాత్ర చేసి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకుంటామని భోజన వసతులకు ఒక వాహనం తమతో పాటు బయలుదేరుతుందని వారు తెలిపారు. గ్రామ పెద్దలు రాజేశ్వరరావు. ముకుంద రెడ్డి నారాయణరెడ్డి బొంబాయి శంకరప్ప బుడబోయి కిష్టప్ప పూజారి బాలప్ప కురువ వెంకటరమణ బలిజ మల్లప్ప అలాగే శివ స్వాములు బయలుదేరడం జరిగింది