
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 18//మక్తల్ //మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప// మహాశివరాత్రి దగ్గర పడుతుండడంతో శివ స్వాముల పాదయాత్రలు జోరందుకున్నాయి. కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లా గురుమిట్కల్ తాలూకా వడ్వాట్ గ్రామానికి చెందిన 20 మంది శివ స్వాములు పాదయాత్రగా వెళుతూ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పెద్ద పోర్లా గ్రామము గేటు వద్ద ఆగారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పాదయాత్ర చేస్తున్నామని మరో ఐదు రోజుల్లో శ్రీశైలం చేరుకుంటామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి. శివప్ప. గజలప్ప. శంకరప్ప. రాజప్ప గిరి స్వామి. శంకర్. సిద్దు. నింగప్ప. అంజప్ప. హనుమంతు. శివ. ఆనంద్ పాదయాత్ర తదితరులు బయలుదేరి వెళుతున్నామన్నారు