
పయనించే సూర్యుడు నవంబర్ 3,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ప్రముఖ శైవ క్షేత్రము, పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామంలో వెలసిన సుబ్రమణ్యేశ్వర స్వామి దేవస్థానము నందు స్వామి వారి భక్తులు సమర్వించిన ముడుపులు, కానుకలు సోమవారం హుండీ నిర్వహించారు.హుండి లెక్కింపు దేవాదాయశాఖ నంద్యాల డివిజన్ తనీఖ అధికారి P. హరిశ్చంద్రరెడ్డి పర్యావేక్షణలో నిర్వహించారని ఆలయ ఏవో రామకృష్ణ తెలపారు. నిర్వహించిన వుండి లెక్కింపు వల్ల రూ: 24 లక్షల 69 వేల 127 రూపాయలు రాబడి. 10 గ్రా. 500 మి. గ్రా బంగారం, 747 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో. యం. రామక్రిష్ణ తెలియజేశారు.ఈకార్యక్రమములో ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్యస్వామి, గ్రామ పెద్దలు మిలటరి సుబ్బారెడ్డి,బీరం శివరామిరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, నందివర్గం బ్యాంక్ అధికారులు అఖిల్, పాణ్యం ASI రఫిక్, ప్చ్ నందునాయక్,అమ్రేజర్. వెంకటసుబ్బయ్య, నంద్యాల బాలాజి సేవా సమితి సభ్యులు,శ్రీరామ సేవ ట్రస్ట్ సభ్యులు నంద్యాల, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.