
పయనించే సూర్యుడు జనవరి11 దండేపల్లి రిపోర్టర్ మందల మల్లేష్
లక్షెట్టిపేట్ శ్రీ చైతన్య పాఠశాల లో విద్యార్థులు శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయినీలు రంగు రంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని అలంకరించి, అనంతరం భోగి మంటలు వేసి నాట్యములు చేస్తూ సంక్రాంతి వేడుకలను విద్యార్థినీలు రకరకాల పూలతో, గొబ్బెమ్మలతో పలు రకాల రంగులతో రంగవల్లులు వేశారు. తదుపరి భోగి మంటలు వేయడం జరిగింది. విద్యార్థినిలకు ప్రిన్సిపాల్ ఎం అశ్విని సంక్రాంతి పండగ గురించి విద్యార్థినిలకు వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డి ఎన్.వి. శ్రీనివాస్ పాఠశాల ఇంచార్జ్ శిరీష శైలజ కిషన్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.,