
( పయనించే సూర్యుడు మే 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణలో ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో షాద్నగర్ పట్టణంలోని శ్రీ నారాయణ హై స్కూల్ విజయ దుందుభి మోగించింది. పి సింధు 570 స్కూల్ టాపర్గా నిలిచారు. మరియు నస్రా అంజు 556 రెండవ స్థానం, సాహితి 556 మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు. అని స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ మీడియాకు తెలిపారు. నారాయణ స్కూల్ లో ఈ మార్కులు సాధించడానికి తమ వంతు సహాయం చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు స్కూల్ కరికులం డైరెక్టర్ వినోద్ మరియు స్కూల్ కరస్పాండెంట్ ఎండి వాజిద్ పాషా కృతజ్ఞతలు తెలియజేశారు.


