PS Telugu News
Epaper

శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నందు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు కళాశాల ప్రిన్సిపాల్ పీ గిరిధర్ రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి విద్యార్థులందరితో ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి చదువు చాలా అవసరం. మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో చదువు కూడా అంతే ముఖ్యం. దేశం ప్రగతి బాటలో నడవడానికి, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడ్డానికి విద్యే మూలం. అందుకే ఆ విద్యను అందించే గురువును ఎంత ప్రశంసించినా తక్కువే. విజ్ఞానాన్ని అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపేది ఉపాధ్యాయులే. డాక్టర్, ఇంజనీర్, రైటర్, సైంటిస్టు ఇలా ప్రతి రంగంలో ఉన్న ప్రముఖులందరూ ఒకప్పుడు ఓ గురువు అడుగుజాడల్లో నడిచినవాళ్లే. ఉపాధ్యాయులు కేవలం సబ్జెక్ట్ విషయాలే కాదు.. క్రమ శిక్షణ, విలువలు, నైతికత, మానవత్వం, ఆత్మవిశ్వాసాలను ఓనమాలతోపాటే నేర్పిస్తారు. అందుకే సమాజానికి అవసరమైన నాలుగు వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి కూడా ఒకటిగా నిలిచింది. రేపటి తరాన్ని, దేశ భవిష్యత్తును రూపొందించేంది టీచర్లే . అటువంటి టీచర్ల కృషిని ఉపాధ్యాయ దినోత్సవం రోజును స్మరించుకోవడం విద్యార్థుల ప్రథమ కర్తవ్యం. అందుకే మన దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయం అయింది. సాఫ్ట్‌వేర్ నుంచి సినిమా స్టార్ వరకూ ప్రతి ఒక్కరూ తమకు అక్షరాలు నేర్పించిన టీచర్లను మరువలేరు. వ్యక్తి ఎంత ఎదిగినా దానికి పునాది వేసేది కచ్చితంగా టీచర్లే. వారి ఇచ్చే అక్షర జ్ఞానం, వారందించే అవగాహన, లోతైన విశ్లేషణ, చెప్పే మాట, తిట్టే తిట్లు అన్ని విద్యార్థి మంచి కోసమే. ఉపాధ్యాయులు రెండు మొట్టికాయలు వేసినా, తిట్టినా, అలిగినా, మాట్లాడకపోయినా అందులో విద్యార్థి శ్రేయస్సు దాగి ఉంటుంది. క్లాస్ రూముల్లో అల్లరి చేస్తే ఉపాధ్యాయులు కోప్పడుతుంటారు. ఆ క్షణంలో టీచర్లు రాక్షసులుగా కనిపిస్తారు. కానీ అంత కచ్చితంగా, కఠినంగా టీచర్లు ఎందుకున్నారో.. ప్రతి వ్యక్తి ఎదిగిన తర్వాత కచ్చితంగా తెలుస్తుంది. వారి తిట్లే వారి దీవెనలని ప్రతి వ్యక్తి రియలైజ్ అవ్వకుండా ఉండరు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రమేష్, సురేష్, సుబ్బారెడ్డి ,మునెయ్య, అంకయ్య, సుబ్రహ్మణ్యం, ఇంగ్లీష్ రమణ, రెహమాన్, మల్లికార్జున్, రాజశేఖర్ పాల్గొన్నారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top