
1). ప్రవచనాలు ప్రసంగిస్తున్న దృశ్యం..
2). హోమం నిర్వహిస్తున్న దృశ్యం..
రుద్రూర్, ఆగస్టు 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సర్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం గణేష్ మండలి వద్ద కామారెడ్డి వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ భక్తులకు ప్రవచనాలు ప్రసంగించారు. అలాగే హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హోమ కార్యక్రమంలో పలువురు దంపద జంటలు పాల్గొని హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి నిర్వాహకులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
