
పయనించే సూర్యుడు మే 3 (పొనకంటి ఉపేందర్ రావు )
తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల జాయింట్ డైరెక్టర్ డి ఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం నాడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చిన వారిని దేవస్థానం పర్యవేక్షకుడు సాయిబాబా మరియు అర్చక స్వాములు దేవస్థానం సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ముందుగా బలపీఠం వద్ద పూజలు నిర్వహించి, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటిడిఏ అదనపు పౌర సంబంధాల అధికారి జి.వెంకటరమణ, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.