
ఆలయ కార్య నిర్వహణ అధికారి కంది సుధాకర్. .
పయనించే సూర్యుడు // ఏప్రిల్// 3 // హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కంది సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈవో, విలేకరులతో మాట్లాడుతూ..అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సీతారాముల బ్రహ్మోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి ప్రారంభమవుతాయన్నారు. 6వ తేదీన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, భక్తులు దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఈవో తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అలాగే చలువ పందిళ్లను వేసినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవం రోజున భక్తులకు భోజన ఏర్పాట్లను జమ్మికుంట మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.