తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ నాయకులు ఖాజాపాషా (కేపీ )..
( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామానికి చెందిన షాద్ నగర్ టీఎన్జీవో కార్యదర్శి పోలె శ్రీహరి తల్లి పోలె సాయమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు.. ఈ సందర్భంగా ఆమె మరణ వార్త తెలుసుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్) స్టేట్ కౌన్సిల్ ఖాజాపాషా (కేపీ ) గ్రామానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుమారుడు శ్రీహరిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి , కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు..

