
ఏడిఏ రమాదేవితో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం..
( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
నియోజకవర్గ పరిధిలోని రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏడిఏ రమాదేవి, మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ తో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతుల కోసం నూతనంగా వచ్చిన యంత్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయాన్ని ఇలాంటి ఆటంకం లేకుండా ముందుకు నడిపేందుకు తన వంతుకు సహకారాన్ని అందిస్తానని సందర్భంగా ఆయన వెల్లడించారు. పరికరాలు ఇవి.. డివిజన్ కు సంబంధించి నూతనంగా వచ్చిన పరికరాల వివరాలు ఏడీఏ రమాదేవి వివరించారు. బ్యాటరీ/పుట్/మ్యానువల్ స్పెయర్ లు 875, పవర్/జ్ఞాపక స్పెయర్ లు165, రోటవేటర్లు 50, కల్టివేటర్/డిస్క్ హరో/ఎంపీ ప్లాన్/కేజ్ వీల్స్/రోటో ప్లెడర్లు 90, సీడ్ కం ఫర్టిలైజర్స్ డ్రిల్ లు 10, బండ్ ఫార్మర్లు (నాన్ పిటిఓ) మూడు, బంటు ఫార్మర్లు రెండు, పవర్ విడర్ నాలుగు, బ్రష్ కట్టర్లు 14, పవర్ టిల్లర్లు ఏడు, మెతి సెల్లర్స్ 5, స్టా బేలర్ లు 18 మంజూరు అయినట్లు వెల్లడించారు. వీటిని రైతుల అవసరాలకు వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రమాదేవితో పాటు నిశాంత్ కుమార్ తదితర సిబ్బంది పాల్గొన్నారు..