
( పయనించే సూర్యుడు ఆగస్టు 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం టీచర్స్ కాలనీలోన ఢిల్లీ వరల్డ్ స్కూల్లో బుధవారం నా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీకృష్ణుడు, సత్యభామ, రాధ, గోపికల వేషధారణలతో నృత్యాలు చేస్తూ ఎంతో అలరించారు. శ్రీకృష్ణుని పుట్టుక ,కృష్ణ లీలలు, గోపికలతో ఆటలు, కంసుడు సంహారం మొదలైన వాటిని అద్భుతంగా ప్రదర్శించారు. అలాగే శ్రీకృష్ణునిపై భక్తితో విద్యార్థులు ఎన్నో భక్తి గేయాలను పాడుతూ ఎంతో గొప్పగా ఉపన్యాసాలతొ అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. వారి ప్రదర్శనలకు మంత్రముగ్ధులైపోయారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి మాట్లాడుతూ….శ్రీకృష్ణుని జన్మదినం భద్రపద మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి న జరుపుకుంటామని, విష్ణువు ఎనిమిదవ అవతారంగా ధర్మరక్షణ, దుష్టశిక్షణ కోసం భూమి పై వతరించాడని, ఆరోజు భక్తులు ఉపవాసం చేసి రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని వివరించారు. విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు అలవర్చేలా ఈ కార్యక్రమాలు తోడ్పడుతాయన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
