ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ రైతన్నలు
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చిన వీర్లపల్లి శంకర్ మరియు రైతులు
( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ పర్యటనకు బయలు దేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు షాద్ నగర్ పట్టణ కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ శ్రేణులు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేసిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నియోజకవర్గ రైతులు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సంక్రాంతి పండుగ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి సెల్ఫీలు దిగడానికి ఎగబడిన కాంగ్రెస్ శ్రేణులు.