
( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లయన్స్ క్లబ్ అఫ్ సేవా సంకల్ప్ ప్రెసిడెంట్ లయన్ రవి కుమార్ ఆధ్వర్యంలో నేడు స్థానిక బుగ్గరెడ్డి ఫంక్షన్ హాల్ షాద్ నగర్ నందు రిజియన్ చేర్మెన్ ఏ.మనోహర్ రెడ్డి సహకారం తో డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ & షాద్ నగర్ గ్రంథాలయం చైర్మన్ లయన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి సమక్షంలో విద్యార్థిని జాహ్నవి కి సైకిల్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ రాజేందర్ రెడ్డి,లయన్ అశోక్, లయన్ సతీష్, లయన్ వెంకట్, గ్రంథాలయం వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రీజియన్ చైర్మన్ ఏ.మనోహర్ రెడ్డి కి ఘన సన్మానం లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా సంకల్ప్ షాద్ నగర్ రీజియన్ చైర్మన్ ఏ.మనోహర్ రెడ్డి సేవలు ఇలాగే మరెందరికో ఉపయోగపడాలని,ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.
