Thursday, June 5, 2025
Homeఆంధ్రప్రదేశ్షాద్ నగర్ లో ఘనంగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు

షాద్ నగర్ లో ఘనంగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు

Listen to this article

సర్కార్ దవాఖాన ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను షాద్ నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ సూచన మేరకు బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సర్కార్ దవాఖానా ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర వెల కట్టలేనిది, పదేండ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు తనదైన శైలిలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి రైతుల పాలిట దేవుడయ్యారని కొనియాడారు. ఆయన వ్యవహార శైలి, పనితీరు మేడి తరం నాయకులకు ఆదర్శనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, నాయకులు లక్ష్మణ్ నాయక్, వీరేశం గుప్తా, వెంకట్రాం రెడ్డి, బచ్చలి నరసింహా, పిల్లి శేఖర్, జూపల్లి శంకర్, చీపిరి రవి యాదవ్, హరికృష్ణ గౌడ్, గౌస్ జానీ, నందిగామ శ్రీనివాస్, జంగయ్య, రాహూఫ్, రమేష్ యాదవ్, భువనేశ్వర్ రెడ్డి, గుండు అశోక్, కంది రాఘవేందర్ గౌడ్, శివ ఎస్పీ, అద్నాన్, శరత్, సుశాంత్, మంగ శ్రీశైలం, సందీప్ సింగ్, పిట్టల మల్లేష్, నవీన్, అభిలాష్, రాజశేఖర్, భాస్కర్, కావలి రాకేష్, సంజు నాయక్, చౌలపల్లి శ్రీకాంత్, తేజ, పవన్, సాయి తేజ, జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments