
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 28(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో యువకులు మరియు స్థానిక యువతీ యువకుల సమక్షంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. కేవలం 23 సంవత్సరాల వయస్సులో భారత స్వతంత్ర సంగ్రామంలో ఉరికొయ్యను ముద్దాడిన అమర వీరుడని కొనియాడారు.. చిన్న తనంలోనే మొక్కలని నాటుతూ తుపాకులు నాటుతున్నానని వారి తండ్రి గారికి చెప్పాడని, 13 ఏళ్ళ ప్రాయాంలోనే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ భక్తి ని చూపారని, లాలా లజపతిరాయ్ హత్య అనంతరం ఆయన రక్తం మరిగి పోలీస్ అధికారి స్కాట్ ను కాల్చబోయి సాండర్స్ ను కాల్చి తన శైలి ని బ్రిటిష్ వారికీ తెలియజేసి ఉరికంభం ను ముద్దాడాడని, తను చిందించిన రక్తం యువ భారత్ ను మేల్కొల్పాలని ఆయన ప్రాణం వదిలే సమయం లో “ఇంక్విలాబ్ జిందాబాద్ ” అంటూనే తుది శ్వాస విడిచారు అని, ఆయన జీవితం ను స్ఫూర్తి గా తీసుకొని యువత ధైర్యంగా అన్ని రంగాల్లో రాణించి నవ భారత్ నిర్మాణం లో పాల్గొనవలెనని లియో క్లబ్ సభ్యులు విశ్వం, అమర్, శేఖర్, కార్తీక్, శ్రీనివాస్ ఆచారి పేర్కొన్నారు.
