
షీ టీం పై విద్యార్థినీలకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం…
రుద్రూర్, మే 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్ కళాశాలలో విద్యార్ధినీలకు మంగళవారం షీ టీం, సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా షీటీమ్ బృందం వారు మాట్లాడుతూ.. మహిళలు, బాలికల భద్రతే షీటీమ్స్ లక్ష్యమన్నారు. ఎక్కడైన ఆకతాయిలు, బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాలికలను మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం బృందం పీ.సి.విజయ్ కుమారి, డబ్ల్యూపీసి సునాయన, రుద్రూర్ ఎస్సై పి.సాయన్న, పోలీసులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.
