పయనించేసూర్యుడు.
న్యూస్.10.జనవరి.
పుల్కల్ ప్రతినిది.పెద్దగొల్లవిజయ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిదిలొని కోడూర్ గ్రామంలోతేది
2 జనవరి 2025 నాడు రాత్రి పదిన్నర సమయంలో పుల్కల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన రాజు మరియు మల్లేష్ ఇద్దరు స్నేహితులు గొడవ చేసుకోవడం జరిగింది.మల్లేష్ తనకు తెలిసిన వాళ్ళ దగ్గర 20,000 హ్యాండ్ లోన్ తీసుకోవడానికి రాజుని షూరిటీ పెట్టమని అడగగా రాజు షూరిటీ ఇవ్వలేనందున కోపో ద్రేకుడు అయిన మల్లేష్ రాజుని చంపాలన ఉద్దేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజు గొంతు పైన కోయడం జరిగింది ఈ విషయంపై రాజు అడ్డుపడగా తన చెయ్యి కూడా కోయడం జరిగింది. పై విషయంపై కేసు నమోదు చేసి నేడు అనగా 10 జనవరి 2025 నాడు మల్లేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని పుల్కల్ ఎస్.ఐ.క్రాంతికుమార్ పాటిల్అన్నారు.