
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 15
5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగాలన్ని ఆదివాసీలకే ఉండాలని భారత్ ఆదివాసీపార్టీ ప్రతిపాదించిదని భారత్ ఆదివాసీపార్టీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని డుంగర్ పూర్ వేదికగా జరుగుతున్నా జాతీయస్థాయి ఆదివాసీ సమావేశంలో దేశంలోని వివిధ ఆదివాసీ రాజకీయ పార్టీలు,ఆదివాసీ సంఘాలు హజరైనాయని,ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి హజరైన భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాలు శతశాతం స్ధానిక ఆదివాసీలతో నియమించే జిఓ ఎంఎస్ నెం3 ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని,ఆ జిఓ స్ధానంలో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని పోరాడుతున్నామని,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాల్సింది గిరిజన సలహా మండలి అని,ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరమైనా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదని,ముందుగా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో ఈ మధ్యనే గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసారని,ఆదివాసీల పోరాట విజయని, త్వరలోనే గిరిజన సలహా మండలి ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం కూడా ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ,షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం జాతీయస్థాయిలో కూడా ఉండాలని భారత్ ఆదివాసీపార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ పార్లమెంట్ లో మాట్లాడాలని భారత్ ఆదివాసీపార్టీ జాతీయ అధ్యక్షులు మోహన్ లాల్ రోత్ సూచించారు.పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయని,బోగస్ గిరిజన కుల ధృవీకరణ పత్రాలతో గిరిజన హక్కులు పొందుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు రాజబాబు కోరారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుండి భారత్ ఆదివాసీపార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తెల్లం రవి ప్రసాద్,రాష్ట్ర కార్యదర్శి సరియం కన్నప్పరాజు పాల్గొన్నారు.Q