
ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలి.ఏపీ ఆదివాసి జేఏసీ.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 29
షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమాకల చట్టం తక్షణమే ప్రకటించి ఆదివాసి ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం మండల కేంద్రంలో ఉన్న యుటిఎఫ్ భవనం నందు ఈరోజు ఆదివాసీల అఖిలపక్ష సమావేశం ఆదివాసీ నిరుద్యోగుల సంఘం,ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో మాట్లాడుతూ 2025 మెగా డీఎస్సీ లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.కావున ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించి ఆదివాసి స్పెషల్ డిఎస్సి తక్షణమే ప్రకటించాలని,ఐటీడీఏ బైలా మరియు గురుకుల బైలా ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ నియమకాలు,ప్రమోషన్స్ మరియు బదిలీలు జరగాలని,ఎన్నికల ముందు ఏపీ సీఎం అరకలో స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకు వందశాతం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జీవో నెంబర్ 3 పునరుద్ధరించి ప్రత్యామ్నాయ జీవో ఇస్తానన్న హామీ నిలబెట్టుకోవాలన్నారు.ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు స్థానిక ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని,ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలు ఆదివాసీ నిరుద్యోగ యువతకు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఆదివాసి నిరుద్యోగులంతా శాంతియుత ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ నాయకులు పంతు బాలకృష్ణ, ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,మడకం బంగారు బాబు,మడి మురళి,గుమ్మడి లోవ ప్రసాద్,పులి అశోక్,అడ్వకేట్ మడివి రవితేజ,దూసరి కనకదుర్గ,పద్మ,రత్నాకర్,పి.రాజ్ కుమార్,సిహెచ్ విద్యాసాగర్ నడిపూడి సంజీవరెడ్డి,సర్పంచ్ వేట్ల విజయ,తీగల బాబురావు ఆదివాసి నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
