
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూలై 22 షెడ్యూల్డ్
ప్రాంత నియామకాల చట్టం చేయాలని,టిఎసి భవన్ నిర్మించాలని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.పాడేరు ఐటీడీఏ సమావేశమందిరంలో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదాభార్గవి అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ లో రాజబాబు పాల్గొని వినతి పత్రాన్ని అందించారు.నెహ్రూ పంచశీలగా ప్రసిద్ధి చెందిన 1952 నేషనల్ ట్రైబల్ పాలసీ,1986 జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)ను అనుసరించి షెడ్యూల్డ్ ప్రాంతంలో శత శాతం ఉద్యోగాలు కల్పించేందుకు జిఓ నెం 275, జిఓ నెం3 లను ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని,రకరకాల కారణాలు చూపించడంతో జిఓ 3ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.జిఓ 3 మీద సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి,కేసు కోర్టులో ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ప్రభుత్వం ఇవ్వడంతో షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగుల తీవ్రంగా నష్టపోతున్నారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లోకి వచ్చే గిరిజనేతరుల వల్ల షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉండే భూబదాలయింపు నిషేధ చట్టం(1/70చట్టం)ఉల్లంఘించబడుతుందని,ఒక అధ్యయనంలో ఆదివాసి సంస్కృతీ,సాంప్రదాయాలు అంతరించిపోయే దశలో ఉండడానికి షెడ్యూల్ ప్రాంతానికి ఉద్యోగరీత్యా వచ్చిన చిన్న చిన్న గిరిజనేతర ఉద్యోగులు, ఉపాద్యాయులే కారణమని తేలింది. ఇక చట్టం చేసుకోవడమే తరువాయి.రాష్ట్ర క్యాడర్ పోస్టులు 30%, జోనల్ క్యాడర్ పోస్టులు 50%, లోకల్ క్యాడర్ పోస్టులు పూర్తిగా స్థానిక ఎస్టీలకు ఇచ్చేందుకు కొత్త చట్టం ఆర్టికల్ 244 (1) క్లాజ్ 5(2) ప్రకారం టీఎసి ద్వారా చేసుకోవచ్చు.గిరిజన సలహా మండలి(టిఎసి)సభ్యులందకి ఈ చట్టం తయారు చేసుకునే విధానం పై అవగాహన కల్పించాలని,టిఎసి భవనాన్ని అసెంబ్లీ పక్కనే నిర్మించాలని,టిఎసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ని నియమించాలని,
షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించిన ఎస్టీలనే టిఎసి సభ్యులుగా నియమించాలని,షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, షెడ్యూల్ ప్రాంతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డీఎస్సి 2025 నుండి మినహాయించాలని, షెడ్యూల్ ప్రాంతానికి ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో పూర్తి సిబ్బందిని నియమించి వారి చేత ఎల్టీఆర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయించాలని,ఏస్డిస్సీ కార్యాలయాల్లో సిబ్బంది డిప్యూటేషన్లను రద్దు చేసి ప్రతి నెల ఎన్ని కేసులు ఫైల్ చేశారూ, ఎంతమందిని సెక్షన్ 6A ప్రకారం అరెస్టు చేశారని సమీక్ష చేయాలని,ఈ సమీక్షకు ఆదివాసి నాయకుల్ని అధికారికంగా ఆహ్వానించాలని,2013 భూసేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఎల్టీఆర్ భూములను సేకరించి కోట్లు కొల్లగొడుతున్న దళారులు అధికారులు ప్రజాప్రతినిధులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో ఆయన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు,పలు రాజకీయ పార్టీలు నాయకులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.