ఇల్లు చోరీ కాకుండా జాగ్రత్త తీసుకోవాలి
పయనించే సూర్యుడు తేదీ
గాజులరామారం రిపోర్టర్: ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా)
పండగకు ఊరు వెళ్లే క్రమంలో ఇళ్లల్లో ఉండకపోవడం అదునుగా చేసుకుని దొంగలు పన్నాగాలు రచిస్తారు. ఇల్లు చోరీ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూరప్రాంతాలకు వెళ్లేవారు ఇంటి చిరునామా ఫోన్ నెంబరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. పోలీసులు సంబంధిత ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారు, మీ ఇంటిని గమనించాలని నమ్మకమైన ఇరుగుపొరుగు వారికి సూచించాలి. సీసీ కెమెరాలు అమర్చుకొని ఆన్లైన్లో మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి, ఊరు వెళ్తే బంగారం వెండి ఇతర విలువైన వస్తువులు నగదు ఇంట్లో ఉంచొద్దు.. వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలి. తాళం వేసిన తర్వాత తలుపు కనిపించకుండా పరదా వేయాలి. ఇంట్లోని ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోవాలి. సొంత ఇంటికి అయితే కచ్చితంగా ఇలుప గ్రిల్ పెట్టుకోవాలి ఇంటి బయట మోషన్ సెన్సార్ లైట్లు ఏర్పాటు చేస్తే రాత్రివేళ పని చేస్తాయి పరిసరాలలో ఏదైనా కదలిక గుర్తిస్తే వెంటనే లైట్ వెలుగుతుంది. ఇంటికి సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సార్ లేదా సెంట్రల్ లాక్ సిస్టం వ్యవస్థ అమర్చుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు పత్రికలు తలుపు ముందు జమవకుండా చూడాలి. వాహనాలను కచ్చితంగా ఇంటి ఆవరణలో పార్కింగ్ చేయాలి. ద్విచక్ర వాహన చక్రాలకు ప్రత్యేక తాళం వేయాలి. సొంతూరు.. విహారయాత్రలకు వెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దు. కాలనీ సంఘాలు అపార్ట్మెంట్లలో కచ్చితంగా భద్రత సిబ్బందిని నియమించుకోవాలి చోరీలకు ముందు దొంగలు కచ్చితంగా రెక్కీ చేస్తుంటారు. పగటిపూట వేరువేరు కారణాలతో కాలనీలో తిరుగుతారు కాలనీలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై డయల్ 100 లేదా స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి.