పయనించే సూర్యుడు: జనవరి 13: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని కొప్పుసూరు కాలనీ గ్రామంలో ప్రతి గ్రామ ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా పిండి వంటల కోసమే ప్రతి ఒక్కరు పిండి మిషన్లు దగ్గరకి బార్లు తీస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పిండి మిల్లులు యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మూలకు ఉన్న పిండి మిషన్లు తిరిగి సంక్రాంతి సందర్భంగా తెలుసుకోవడంతో పిండి మిషన్లు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రజలు సంతోషంగా పిండివంటలతో సంక్రాంతి జరుపుకుంటామని తెలియజేశారు.