
పయనించే సూర్యుడు జులై 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం,,,
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు,,
శివరాం నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు
జె ఆర్ నగర్ నందు ఇంటింటికి సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లతో కలిసిఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినా సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను వారికి తెలియజేస్తూ పింఛన్లు, గ్యాస్, తల్లికి వందనం రేషన్ కార్డులు, మరియు ఆగస్టు 15 నుండి ఆడవాళ్లకు ఉచిత బస్సు రైతులకు రైతు భరోసా, ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను వారికి వివరించడం జరిగినది. అంతేకాకుండా 2047 కల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానం లో నిలబడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారని ఆయన తెలియజేశారు. త్రాగునీరు, రోడ్లు పలు సమస్యలను దృష్టికి తేవడం జరిగినది. ఆయన వారి సమస్యను సానుకూలంగా విని వెంటనే అధికారులకు ఫోన్ చేసి వారి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వారు ఎదుట తెలపడం జరిగినది.