జనం న్యూస్- జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు సంబంధించిన గ్రామసభను స్థానిక బాలికల పాఠశాలలో నిర్వహించారు, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను తయారు చేస్తున్నామని తెలిపారు, ఇంకా సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎవరన్నా ఉంటే గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్, నాలుగవ వార్డు కౌన్సిలర్ మంద రఘువీర్ బిన్నీ ,సూపర్వైజర్ అర్చన , వార్డు ఆఫీసర్ రమేష్ అంగన్వాడి టీచర్ , తదితరులు పాల్గొన్నారు.