
పయనించేసూర్యుడు. న్యూస్.21.జనవరి. పుల్కల్ ప్రతినిది. పెద్దగొల్లవిజయకుమార్….
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం జోగిపేట నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది సోమవారం తెల్లవారుజామున బండల లోడుతో కర్నూల్ బేతంచెరువు నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై ఉన్న వంతెన పై నుంచి అదుపుతప్పి కింద పడింది. లారీకి సంబంధించిన టైలర్ మొత్తం బ్రిడ్జిపై ఉండిపోయాయి లారీ నుజ్జు అయింది లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో లారీ డ్రైవర్ షాకీర్. సుమారుగా 3 గంటల పాటు లారీలో క్యాబిన్ ముందు భాగంలోని ఇరుక్కొని పెద్దగా అరుపులు పెట్టాడు క్లీనర్ ధర్మేందర్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జోపేట్.ఎస్ఐ. పి. పాండు పోలీస్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు లారీలో ఇరుక్కున్న డ్రైవర్ షాకీర్ ను హోంగార్డ్ శ్రీశైలం బయటకు లాగి తన భుజంపై వేసుకొని బయటకు తీసుకొని వచ్చాడు అంబులెన్స్ లో జోగిపేటప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రైవర్ క్లీనర్ కు వైద్య చికిత్సలు చేసి మెరుగైన వైద్య చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం శివమాలతో ఉన్నప్పటికీ డ్రైవర్ను బయటకు తీసుకురావడంతో చేసిన సహాయక చర్యలపై అక్కడ ఉన్నవారు హోంగార్డు నూ అభినందించారు.