పయనించే సూర్యుడు. జనవరి 26. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు * 4 పథకాల ద్వారా ప్రజల సంక్షేమానికి 45 వేల కోట్లు ఖర్చు
ఇండ్ల లేని చివరి పేద కుటుంబానికి ఇండ్లు ఇచ్చేవరకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుంది
కొణిజర్ల మండలం చిన్న గోపతి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ గ్రామసభలో పాల్గొన్న డిప్యూటీ సి.ఎం రాష్ట్రంలో సంపదను సృష్టించి నిరుపేదలకు పంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం కొణిజెర్ల మండలం చిన్న గోపతి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన నాలుగు పథకాల ప్రారంభోత్సవ గ్రామసభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని నేడు అమలు చేసుకున్న పవిత్రమైన రోజు అని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ ప్రపంచంతో పోటీ పడేలా ఎదిగేందుకు మన రాజ్యాంగం బలమైన పునాదులు వేసిందని అన్నారు. మన విధులు, జీవన విధానం, మనకు ఉన్న హక్కులు, సమాన అవకాశాలు కల్పిస్తూ బావ స్వేచ్ఛకు సంపూర్ణ హక్కు కలిగిస్తూ భారత రాజ్యాంగం అమలు చేసుకున్నా మని, ఇది మన జీవన విధానమని అన్నారు. పరమ పవిత్రమైన ఈ రోజు 4 నూతన పథకాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ నాలుగు పథకాల క్రింద సంవత్సరానికి ప్రజలకు 45 వేల కోట్లు అందించడం జరుగుతుందని అన్నారు. సాచురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. గతంలో పాలకులు రైతు కూలీలు, పేదలకు ఇండ్ల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. నేడు భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సహాయం, ఇండ్లు లేని చివరి పేద కుటుంబానికి ఇండ్లు ఇచ్చేవరకు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం క్రింద సంపద సృష్టించి పేదలకు పంచడమే లక్ష్యమని అన్నారు. నాలుగు గోడల మధ్య లబ్ధిదారుల వివరాలు తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా ప్రజల మధ్యలో లబ్ధిదారులను ఎంపిక చేసామని అన్నారు. గ్రామసభలలో ప్రాథమిక జాబితాలో పేర్లు రాని వారి దగ్గర దరఖాస్తులు తీసుకుని, వాటిని కూడా విచారించి అర్హత ఉంటే పథకాలు అమలు చేస్తామని అన్నారు. పథకాల అమలు పట్ల కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలు తిప్పి కొట్టాలని, చివరి లబ్ధిదారుడు వరకు పథకాలు చేరతాయని అన్నారు. జనవరి 26న ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచురేషన్ పద్దతిలో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. నేడు మంజూరు పత్రం ఇచ్చిన ప్రతి రైతుకు, రైతు కూలీ బ్యాంకు ఖాతాలో సోమవారం నిధులు జమ అవుతాయని అన్నారు. గత పాలకులు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసి చూపించామని, సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇచ్చామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ ల ఉచిత విద్యుత్, 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంపు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసామని అన్నారు.మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు పూర్తి సహకారం అందిస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కు ప్రణాళికలు తయారు చేశామని, ప్రభుత్వంలో అవకాశమున్న ప్రతిచోట మహిళలకు ఆదాయం లభించేలా చర్యలు చేపట్టామని అన్నారు.
త్వరలోనే రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నరకం బియ్యం సరఫరా చేస్తామని అన్నారు. గతంలో ఉన్న రైతుబంధు బకాయిలు కూడా ప్రజా ప్రభుత్వమే చెల్లించిందని, రైతులకు ఉచిత విద్యుత్ క్రింద విద్యుత్ సంస్థలకు 12 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని అన్నారు. ప్రజా సంపదకు కస్టోడియన్ గా ఉంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం మాత్రమే దానినీ వినియోగిస్తామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరిందని, 586 కోట్లతో సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని, 138 కోట్ల రూపాయలు రైతులకు బోనస్ చెల్లించామని అన్నారు. భూసార పరీక్షల దగ్గర నుంచి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ రైతు ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని, కూర గాయల, ఆయిల్ పామ్ సాగు పెంపుకు కృషి చేస్తున్నామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించా మని అన్నారు. అభయ హస్తం గ్యారెంటీ పథకాలు, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం మన జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని అన్నారు. ప్రజలలో ఉన్న డిమాండ్ మేరకు నూతనంగా నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి పథకం చివరి లబ్ధిదారుడు వరకు పథకాలు చేరే వరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామసభలలో చర్చించి పారదర్శకంగా పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అతలాకుతులం చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితులను బాగు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ ల ఉచిత విద్యుత్, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణ మాఫీ పూర్తి చేశామని అన్నారు. ప్రభుత్వం అమలు చేసే పధకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని, ఇప్పుడు పథకాలు రాని వారు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని, దరఖాస్తు చేసుకుంటే విచారించి అర్హత ఉంటే తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. వ్యవసాయ సాగు యోగ్యమైన భూమి గుర్తించి గ్రామంలో గ్రామసభ ద్వారా ఆమోదించుకొని రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులను ప్రాథమికంగా ఎంపిక చేయడం జరిగిందని, అర్హులకు పథకాల వర్తింపు నిరంత రాయంగా కొనసాగుతుందని ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఖమ్మం సీపీ సునీల్ దత్, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, డి.ఎల్.పి.ఓ. రాంబాబు, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
సంపదను సృష్టించి ప్రతి పైసా పేదలకు పంచుతాం భట్టి.
RELATED ARTICLES