
పయనించే సూర్యడు // మార్చ్ // 24//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
ఏఐసీసీ మరియు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు చేపట్టిన “సంసద్ ఘోరావ్ పార్లమెంట్ ముట్టడి” కార్యక్రమంలో భాగంగా, రేపు 25-03-2025 మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఉద్యోగం ఇవ్వండి కానీ , సంకెళ్ళు కాదు అంటూ, ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ముట్టడికి, హుజురాబాద్ నియోజకవర్గం నుండి బయలుదేరిన జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు – బుడిగె శ్రీకాంత్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ; కాంగ్రెస్ పార్టీ పిలుపే శాసనంగా ఏఐసీసీ నుండి మొదలుకొని మండలం వరకు ఏ పిలుపు ఇచ్చిన తూచ తప్పకుండా దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం నియంతృత్వం పరిపాలనకు వ్యతిరేకంగా, అన్ని రాష్ట్రాల నుండి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడించేందుకు కదం తొక్కడం జరుగుతుందన్నారు. బీజేపీ నియంతృత్వ పోకడలకి నిరసనగా జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ మరియు ఇంచార్జి కృష్ణా అల్లవారు ఆదేశాల మేరకి తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరగబోయే “సంసద్ ఘోరావ్ పార్లమెంట్ ముట్టడి” కార్యక్రమానికి బయలుదేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ; యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ వెంట ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్ తదితరులు తరలి వెళ్ళారు.
