
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలంలోని మండల కేంద్రంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వాగొడ్డు తండ యందు ఐదవ తరగతి చదువుతున్న బండారి చిద్విలాష్ మరియు గుగులోత్ అవంతిక ఇద్దరు విద్యార్థులు పై చదువులు కొరకు ఆరవ తరగతి ప్రవేశానికి తెలంగాణా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సెలక్షన్ టెస్ట్ అనే ప్రవేశ పరీక్ష ఆధారంగా ఆంగ్ల బోధన సిబిఎస్ఇ భోధన మాధ్యమంలో వేల మంది పోటిపడ్డ పరీక్షలో, అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పట్టు దలతో చదివితే ఏదైనా దేనైన సాధించగలమనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య మధ్య తరగతి పేద కుటుంబం నుండి బండారి చిద్వీలాష్ మరియు గూగులోత్ అవంతిక సీటు సంపాదించి నిరూపించారు… బండారి చిద్విలాష్ అనే విద్యార్థి రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో సీటు మరియు పైన్ ఆర్ట్ స్కూల్ ల్లో కూడా ప్రవేశ పరీక్ష ల్లో పోటీ పడి వాటిల్లో కూడా సెలెక్ట్ అయ్యాడు.. పాఠశాల ప్రధనోపాధ్యాయులు భూక్యా వీరన్న అదే పాఠశాలల్లో పని చేస్తున్న తెలంగాణ దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి భానోత్ లక్ష్మా, మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరూ, సదరు విద్యార్థులను ఆదర్శంగాచేసుకొని , అదే స్పూర్తితో భవిష్యత్తులో మరెన్నో సీట్లు సాధించాలని , ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, క్రమ శిక్షణతో చదివితే ఏదైనా సాధించవచ్చని, చదివిన పాఠశాలకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచిపేరు ప్రఖ్యాతులు తేవాలని , ఉన్నత స్థాయిలో నిలువాలని ఆకాంక్షించారు…. ప్రవేశ పరీక్ష ఫలితాలులో సత్తా చాటిన విద్యార్థులకు సంతొషం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు