
బీఆర్ఎస్ నాయకులు మురళీకృష్ణ యాదవ్
హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త నరేష్ గౌడ్ స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి బీఆర్ఎస్ నాయకులు వై. మురళీకృష్ణ యాదవ్ గారు హాజరై, స్వామి వారిని దర్శించుకొని, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్తీకమాసంలో ఈ వ్రతం నిర్వహించడం శుభప్రదమని అన్నారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ కౌన్సిలర్ బచ్చలి నరసింహా, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు వీరేశం గుప్తా, బాలరాజు, బుగ్గకృష్ణ, రాము, ర్యాకల నర్సింలు, యాదయ్య, గోపాల్ గౌడ్, శివశంకర్, గుండు అశోక్, రాజు, కృష్ణ, గురు, నవీన్ తదితరులు ఉన్నారు.