( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ పట్టణంలో నవంబర్ 2న అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాదవ సదర్ సమ్మేళన కార్యక్రమానికి హాజరు కావాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ని ఆహ్వానించారు యాదవ సంగం నాయకులు. సదర్ కమిటీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నడికూడ రఘునాథ్ యాదవ్, తాలూకా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, సదరు కమిటీ మాజీ అధ్యక్షులు నడికూడ యాదగిరి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు నక్క బాల్ రాజ్ యాదవ్, కేశంపేట మండల అధ్యక్షుడు పసుల నర్సింలు యాదవ్, ఎల్గనమోని గిరి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు పద్మారం వెంకటేష్ యాదవ్, తుమ్మల నర్సింలు యాదవ్, కొందుర్గు మండల అధ్యక్షులు బుయ్యని రవీందర్ యాదవ్, అనీల్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ని ఆయాన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించి, మొక్కను అందజేసి సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు.

