Friday, July 11, 2025
Homeఆంధ్రప్రదేశ్సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి

సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు.
ఆషాఢ శుద్ధపౌర్ణమిని గురుపూర్ణిమ’వ్యాసపూర్ణిమ’అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి , గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని , వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. *గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. యతులు ఎక్కడకీ వెళ్లకుండా ఒకచోట ఉండి జ్ఞానబోధ చేసే సమయమే ఈ చాతుర్మాసం. ఈ కాలంలోని తొలి పౌర్ణమి గురుపౌర్ణమి. అంటే తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను సమీపించి , పూజించి , జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురుపౌర్ణమి భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్ఠమైంది. దీని వెనుక ఒక విశిష్టత దాగి ఉంది.పురాణాల కథనం ప్రకారం పూర్వం వారణాసిలో బీద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి. ఆయన సతీమణి పేరు వేదవతి. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన , భక్తి జ్ఞానం కలిగి జీవించే ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి , వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా ఆయన దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వేయికళ్లతో వెతకడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం , కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా ‘మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను. కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరు చున్నాను’ అని అంటాడు.ఆ మాటలకు ఖంగుతిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ , ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదనిధిని ఆప్యాయంగా పైకిలేపి ఏమి కావాలో కోరుకోమంటారు. రేపు నా తండ్రి పితృకార్యం , దానికి తమరు బ్రాహ్మణార్థమై అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి మహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు.ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాసభగవానుడిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు , పువ్వులను సిద్ధం చేసి , శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహించి , అనంతరం వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్ఠుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమన్మారు.స్వామి ఎన్ని నోములు , వ్రతాలు చేసినా సంతానభాగ్యం మాత్రం లేదని , ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు , ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి , వేదవతి సంతానయోగం లభించింది. సుఖసంతోషాలతో జీవిత చరమాంకంలో విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments