
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా కోటకొండ // 5 తేదీ ఏప్రిల్ //వడ్ల శ్రీనివాస్
బాలు పవర్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు
నారాయణపేట మండలం అవంగాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు రేషన్ డీలర్ షాప్ లో ఎస్టీ సేల్ మండలాధ్యక్షుడు బాలు పవర్ నాయక్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆమెని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చి నిలబెట్టుకుంటున్నారని ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్. చంద్ర నాయక్ దేవి భాయ్ జూమీబాయి నీలి భాయ్ కిషన్ నాయక్ కిషన్ నాయకులు పాల్గొన్నారు