
పయనించే సూర్యుడు ఏప్రిల్ ఒకటి టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందుప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీతో ప్రజలకు మేలు జరుగుతుందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యఅన్నారు మంగళవారం ఇల్లందు మండలం బాలాజీ నగర్ షాప్ నెంబర్ వన్ నందు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల దొడ్డు బియ్యం సన్న బియ్యం కు వ్యత్యాసం గమనించాలని అన్నారు కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అన్నారు ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలకే పరిమితమైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే ఆచరణలో చేసి చూపిస్తుందని పేర్కొన్నారు ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ2858 కోట్ల అదనపు భారం పడుతుంది ఎంత భారం అయినా ప్రజల కోసమే ఈ ప్రభుత్వమని తెలిపారు సంక్షేమం అభివృద్ధి సమపానల్లో అందించడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని దొరలే కాదు… పేదలు కూడా సన్న బియ్యం తినాలని ప్రజా ప్రభుత్వం ఆకాంక్ష అదే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఆర్ ఐ ముత్తయ్య, ఆర్ ఐ(సీస్) సోయం రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ సర్పంచ్ పాయం స్వాతి, మండల అధ్యక్షులు పులి సైదులు, రేషన్ డీలర్ శబరిష్, పి.ఈ.ఎస్.ఏ ఉపాధ్యక్షులు ఉపాయం ఆంజనేయులు, కాకాటి భార్గవ్, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీను, చీమల మల్లేష్, పొడుగు రాంబాబు, సురపాక హనుమంతు, రుద్ర రామస్వామి, పాల సతీష్, లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు