
పయనించే సూర్యుడు ఏప్రిల్ 8 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం లచ్చగూడెం లో సన్న బియ్యం లబ్ధిదారుడైన సామాన్యుడు ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ప్రతి పేదవాడి లబ్ధి చేకూరే విధంగా ఉగాది పర్వదినం సందర్భంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించింది. దీంతో ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పై ఉన్న అపోహలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్లల్లో భోజనం చేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య భద్రాద్రి జిల్లా కలెక్టర్ *జితేష్ వి పాటిల్ ఐటీడీఏ పీవో గౌతమ్ డి స్ పి *చంద్రబానుతో కలిసి టేకులపల్లి మండలం లచ్చగూడెం పంచాయతీలో ఓ లబ్ధిదారుడి ఇంట్లో సహపoక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పంపిణీ చేస్తున్న సన్న బియ్యం నాణ్యత గురించి ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగభవాని నియోజకవర్గ నాయకుల కోరం సురేందర్, టేకులపల్లి మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
