
పయనించే సూర్యుడు మార్చి 7 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయములో టాటా ఇంట్రా వి 30 వాహనాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రారంభోత్సవం చేసి లబ్దిదారుడు బానోత్ అశోక్ కి అందించారు, ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని మాట్లాడుతూ. ఐ టి డి ఎ భద్రాచలం మరియు ఎస్ బి ఐ బ్యాంకు ఇల్లందు వారిచే ఈ వాహనం మంజూరు అయిందని వారు తెలియజేశారు.
ఈ ప్రారంభోత్సవం లో ఎంపీడీవో జి. రవీంద్ర రావు, మండల ప్రజా పరిషత్, కార్యాలయ సిబ్బంది మరియు లబ్దిదారుడు బానోత్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.