
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జులై 25
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సమాచార హక్కు చట్టం (RTI) అనేది భారత పౌరులకు ప్రభుత్వ సంస్థలలో ఉన్న సమాచారాన్ని పొందే హక్కును కల్పించే చట్టం అని, ఇది 2005లో అమలులోకి వచ్చిందని, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకతను, జవాబు దారితనాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడిందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ముల్లి శేఖర్ మాట్లాడుతూ అవినీతిని అరికట్టడానికి,ప్రభుత్వ పాలనలో భారత పౌరులకు తమ ప్రభుత్వాలు పనితీరు గురించి , ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమాచార హక్కు చట్టం -2005 ఉపయోగపడుతుందన్నారు. కళాశాల సీనియర్ అధ్యాపకులు జి. వెంకట్రావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం మే 11న లోక్ సభ ఆమోదించిందని, ఈ చట్టం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం మినహా దేశమంతటా ఈ చట్టం వర్తిస్తుందన్నారు. వ్యాసరచన, వక్త్తృత్వ ,చర్చ మరియు క్విజ్ పోటీల్లో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు
ఎస్.అప్పనమ్మ, జి. హారతి, కె.శకుంతల, కె.శైలజ, ఎం.నాగమోహన్ రావు,జి.సాయికుమార్,బి.శ్రీనివాస రావు, ఆర్.మౌనిక,పి. మౌనిక, ఎన్ వి వి ఎస్ ఎన్ మూర్తి, సంగం నాయుడు, శీనయ్య, సుబ్బారావు, కన్నయ్య విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
