
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 26 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్. సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఏనుకూరు మండలం గార్లఓడ్డు గ్రామానికి చెందిన గుగులోత్ బావు సింగ్ ఎన్నికయ్యారు. ఇటీవల గార్ల ఓడ్డు గ్రామంలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర సమావేశంలో బావు సింగ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ సందర్భంగా గుగులోతు బావుసింగ్ మాట్లాడుతూ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తానని. పారదర్శకంగా జవాబుదారితనంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తానని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తానని వారి యొక్క హక్కుల గురించి చట్టాల గురించి అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తానని. బావుసింగ్ అన్నారు. ప్రతి ఒక్కరిని చైతన్యవంతుడిగా చేస్తాను అని తెలపడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బానోతు నందు నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారావు. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ లతికే లక్ష్మణరావు. రాష్ట్ర పొలిటికల్ కన్వీనర్ లకావత్ ప్రసాద్. రాష్ట్ర లీగల్ అడ్వకేట్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.