
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 14//మక్తల్భారతీయ
జనతా పార్టీ 45 వ ఆవిర్భావ వేడుకలు మరియు భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా భా ఫోగం గా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచాలింగాల్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంనిర్వహించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారుపిలుపు మేరకు గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమం లో భాగంగా పంచాలింగల్ గ్రామం లో నాయకులు మరియు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల దగ్గర కు వెళ్లి వివిధ పథకాలగురించి వివరించడంతోపాటు గ్రామం లో ర్యాలీ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పని చేసి విజయం సాధించాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో బీజేపీ జిల్లా నాయకులు సంగంబండ బలరాం రెడ్డి గారు, మరియు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు దేవారింటి నర్సింహ రెడ్డి , బీజేపీ మక్తల్ తాలూకా కన్వీనర్ కర్ని స్వామి ,రూరల్ మండలా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మరియు బీజేపీ మాజీ కౌన్సిలర్ చీరాల సత్యనారాయణ, నర్సిరెడ్డి లక్ష్మిపతి, బాలరాజ్ గౌడ్,శివ లింగం, వెంకటప్ప, మరియు గ్రామస్తులు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది….
