
ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లాంఘిస్తే జరిమానా తప్పదు మత్స్యశాఖ – బాపట్ల
పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 12:- రిపోర్టర్ (కే శివ కృష్ణ )
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాలలో 2025 సం// ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు (61 రోజుల పాటు) తూర్పు బంగాళాఖాతం సముద్రంలో మర మరియు మోటారు (యాంత్రిక) పడవల ద్వారా చేపల వేట చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం జి.ఒ. ఆర్.టి. సంఖ్య 129, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ, ఏప్రిల్ 10 నుండి చేపల వేట నిషేధ ఉత్తర్వులు జారీ చేసియున్నారు. సముద్ర జలాలలో చేపల వేట నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశ్యము “వివిధ చేప, రొయ్యల జాతులు సంతానోత్పత్తి (గుడ్లు పెట్టబడు) కాలములో తల్లి చేపలు మరియు తల్లి రొయ్యలను సంరక్షించడం, వారి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం, తద్వారా సముద్ర మత్స్య సంపద సుస్థిరత సాధించడము మత్స్యకారుల జీవనము అభివృద్ధి చేసుకోవడము.” బాపట్ల మండల మత్స్యకారులందరు ఈ వేట నిషేధ ఉత్తర్వులను అనుసరించి, సముద్ర జలాలలో మర మోటారు (యాంత్రిక) పడవల ద్వారా మత్స్యకారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించగలరు. వేట నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపల వేట చేసిన యెడల ఆయా బోట్ల యజమానులు ఆంధ్ర ప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ఏపీఎం ఎఫ్ ఆర్ యాక్ట్1994), సెక్షన్ -(4) ను అనుసరించి శిక్షార్హులు. అట్టి వారి బోట్లను, బోట్లలో వుండే మత్స్యసంపదను స్వాధీన పరచుకోనుటయే కాక, జరిమానా విధిస్తూ డీజిల్ ఆయిల్ రాయితీ ప్రభుత్వం అందించే అన్ని రకముల రాయితీ సౌకర్యాలను నిలుపుదల చేయబడునని తెలియజేయడమైనది. ఈ వేట నిషిద్ధ కాలమును కచ్చితముగా అమలు చేయుటకై మత్స్యశాఖ, కోస్ట్ గార్డు, కోస్టల్ సెక్యురిటీ పోలీసులు, నావి రెవిన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేయడమైనది. కావున మత్స్యకారులందరూ సహకరించవలసినదిగా కోరడమైనది.
(యం. రవీంద్ర) మత్స్యశాఖ అభివృద్ధి మత్స్యశాఖ అండ్ ఏ.ఓ. బాపట్ల