
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ.వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులలో భాగంగా ఎనిమిదవ రోజు సరస్వతీ దేవి అలంకరణ చేయడం జరిగింది ఉదయం ప్రతిరోజు లాగానే సుప్రభాత సేవ గంగా పూజ పంచామృతాభిషేకము పంచ హారతులు హోమాధి కార్యక్రమాలు జపాలు పంచ హారతులు మహా మంగళహారతి కార్యక్రమం తో పాటు బిందె సేవా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మంగళ వాయిద్యాలతో బిందె కలశపు సేవను నెత్తిపై పెట్టుకుని శోభాయాత్రగా రామాలయం వరకు వెళ్లి పూజలు నిర్వహించి సరస్వతి దేవిని ఆహ్వానించి అమ్మవారి శాల వరకు తీసుకొని వచ్చి మహా మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది సాయంత్రం కుంకుమార్చన మణిద్వీప వర్ణన పల్లకి సేవ తోపాటు 10 సంవత్సరాల లోపల బాలికలకు కన్యకా పూజ నిర్వహిస్తామని అలాగే బాలబాలికలకు పురాణాల్లోని కొన్ని ఘట్టాలు లో నాటకాలు వేసి క్విజ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి బహుమతులు అందిస్తామని అనంతం తీర్థ ప్రసాదాలు పంపిణీ ఉంటుందని యాడికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమాలలో ఆర్యవైశ్య మహిళా సంఘం యాడికి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
